జై జవాన్.. జయహో భారత్
జై జవాన్.. జయహో భారత్
Published Sat, Oct 1 2016 8:45 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
లబ్బీపేట :
‘జై జవాన్..జయహో భారత్..’ అంటూ నినదిస్తూ సుమారు ఐదు వేల మంది విద్యార్థులు శనివారం బందరు రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. భారత జవాన్ల మెరుపు దాడులను కీర్తిస్తూ, వారికి మద్దతుగా శ్రీ చైతన్య విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బెంజిసర్కిల్ నుంచి స్వరాజ్య మైదానం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలను సైతం లెక్కచేయక నిరంతరం దేశ రక్షణకు పాటుపడుతున్న సైనికుల సేవలను విద్యార్థులు కీర్తించారు. ‘మీ వెనుక మేమున్నాం..’ అని నినదించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు వచ్చి వాహనాలను మళ్లించారు. శ్రీ చైతన్య కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement