లోకేశ్‌కు చుక్కలు చూపిన విద్యార్థులు
తెలుగుదేశం యువ చైతన్య సదస్సులో లోకేశ్‌పై ప్రశ్నల వర్షం
- హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి కదా..
- మీరెందుకు ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదు?
- ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన
- రేవంత్ రెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారు?
- విద్యార్థుల ప్రశ్నలతో టీడీపీ నేత ఉక్కిరిబిక్కిరి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘అవినీతిపరులం టూ నీతులు చెబుతున్నారు. మీ పార్టీ ఎమ్మె ల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే మీరేం చర్యలు తీసుకున్నారు. ఆయన అవినీతి చేయలేదా?’అని గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సారుు సంతోశ్‌రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను నిలదీశారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక లోకేశ్ నీళ్లు నమిలారు. నెల్లూరు నారాయణ వైద్య కళాశాలలో శుక్రవారం విద్యార్థులతో టీడీపీ యువ చైతన్య సదస్సు నిర్వహించిం ది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సారుు సంతోశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘సీఎం చంద్రబాబునాయుడు సూచన మేరకే ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేశారని మీరు (లోకేశ్) చెబుతున్నారు. ఈ నిర్ణ యం వల్ల తిమింగలాలు క్షేమంగా తప్పించుకున్నారుు, చిన్న చేపలు చనిపోతున్నారుు’ అని ఆవేశంతో ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయనీ, హోదా కోసం మీరు ఎందుకు పోరాడలేదని నిలదీశారు. ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగేదీమీ ఉండదని సంతోష్ తన అభిప్రాయాన్ని ఉద్వేగంగా చెప్పారు. విద్యా ర్థి ప్రశ్నల దాడికి ఖంగుతిన్న లోకేశ్.. కొంత సేపటి తర్వాత తమారుుంచుకుని సమాధానమిచ్చారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేదలకు మేలే జరుగుతుందనీ, హోదా కోసం కేంద్రంతో విభేదిస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని లోకేశ్ చెప్పారు.
ఉద్యోగాలు ఎక్కడిచ్చారు?
నెల్లూరు గీతాంజలి ఎంబీఏ కళాశాల విద్యా ర్థి వంశీ మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు నిర్మాణానికి మా భూములు ఇచ్చేప్పుడు మాకు పోర్టులో ఉపాధి కల్పిస్తామని ఇప్పుడు వేదిక మీద ఉన్న నాయకులు చెప్పారని నిలదీశారు. ‘మా భూములు ఇచ్చాం. పోర్టులో మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. రిలయన్స సంస్థకు రైతులు 2,700 ఎకరాల భూమి ఇచ్చారు. రిలయన్స అక్కడ ఫ్యాక్టరీ పెట్టలేదు. రైతులకు జీవనోపాధి లేకుండా ఇబ్బం ది పడుతున్నారు. మీరేమో వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు వచ్చినట్లు చెబుతున్నారు’అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టామనీ, పోర్టు వారితో మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని లోకేశ్ సమాధానం ఇచ్చా రు. అమరావతి ధనికుల కోసమే కడుతున్నారు కదా? అని రత్నం కళాశాల విద్యార్థిని శైలజ ప్రశ్నించారు. అలాంటి చోట తమ లాంటి వారికి ఉపాధి ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. అమరావతి అందరి కోసం కడుతున్నామనీ, లోకేశ్ సమాధానం ఇచ్చారు.