ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు పల్లేరు స్వయంప్రభ స్మారక సాహితీ పురస్కారం లభించింది.
పరకాల(వరంగల్): ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు పల్లేరు స్వయంప్రభ స్మారక సాహితీ పురస్కారం లభించింది. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పల్లేరు వీరస్వామి తన భార్య పేరిట ఏర్పాటు చేసిన పల్లేరు స్వయంప్రభ స్మారక సాహితీ పురస్కరాన్ని ఈ ఏడాది అశోక్‌తేజకు అందించారు.
వరంగల్ జిల్లా పరకాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అశోక్‌తేజకు అందించారు. ప్రతిఏటా సాహితీరంగంలో విశేష కృషి చేసిందుకుగాను ఈ అవార్డు ఇస్తున్నారు. కాగా, ఇప్పటివరకు 9 మంది ప్రముఖులకు ఈ అవార్డును ప్రదానం చేశారు.