చికెన్‌ తీసుకురాలేదని.. వివాహిత ఆత్మహత్య | suicide for chicken | Sakshi
Sakshi News home page

చికెన్‌ తీసుకురాలేదని.. వివాహిత ఆత్మహత్య

Published Thu, Nov 17 2016 11:17 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

చికెన్‌ తీసుకురాలేదని.. వివాహిత ఆత్మహత్య - Sakshi

చికెన్‌ తీసుకురాలేదని.. వివాహిత ఆత్మహత్య

కర్నూలు : భర్త చికెన్‌ తీసుకురాలేదని భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నూలు నగరం మద్దూర్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెంచలయ్య ఎన్‌ఆర్‌పేటలోని సురక్ష హాస్పిటల్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తాడు.

గోకులపాడుకు చెందిన సుజాతతో 10ఏళ్ల క్రితం పెళ్లి అయింది. చికెన్‌ తీసుకొని రమ్మని భర్తను కోరగా, అతను ఆలస్యం చేయడంతో క్షణికావేశంలో గొడవపడి ఇంటి తలుపులు బిగించుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement