రాయ్‌పూర్: భర్త చికెన్ తిన్నాడని కోపంతో ఓ మహిళ క్షణికావేశంలో తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ సూరజ్పుర్లో చోటుచేసుకుంది. కరౌదా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆగస్టు 22న తన బంధువుల ఇంట్లో చికెన్ తినడమే ఈ దారుణానికి కారణమైంది. ఎందుకంటే అతను చికెన్ తిన్నది శ్రావణ మాసం చివరి రోజు. చదవండి: ముద్దు సీన్లలో నటించడం వాళ్లకు నచ్చేది కాదు: ప్రీతి జింగానియా
సాధారణంగా ప్రజలు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదనే నియమాలను పాటిస్తారు. మరికొందరిలో ఆ పట్టింపులు ఎక్కువగానే ఉంటాయి. వివరాల ప్రకారం.. మనీషా సింగ్ (19) ఆదివారం రక్షా బంధన్ రోజున తన భర్త రామజన్మతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రానికి వచ్చారు. ఇంతలో రామజన్మ పొరుగున ఉన్న తన అత్త ఇంటికి వెళ్లి చికెన్ తింటుండగా ఆమె వద్దని వారించింది. అయినా రామ్‌జన్మ తన భార్య మాటను పెడచెవిన పెట్టి తిన్నాడు. శ్రావణ్ మాసం చివరి రోజు, రక్షాబంధన్ కూడా కనుక చికెన్ తినడం ద్వారా పొరపాటు చేస్తున్నావని మనీషా తన భర్తకు చెప్పి అక్కడి నుంచి కోపంగా ఇంటికి వెళ్లిపోయింది.
కాసేపటి తర్వాత రామజన్మ ఆమెకు నచ్చజెప్పడానికి ఇంటికి వెళ్లగా, అప్పటికే ఆమె క్షణికావేశంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అతను తన భార్యను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే శరీరం చాలా మేరకు కాలిపోయింది. వెంటనే ఆమెను అంబికాపుర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది.
Comments
Please login to add a commentAdd a comment