మిషన్ కాకతీయతో రైతుకు ప్రయోజనం
జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి
గండేడ్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్ర మం రైతులకు ఎంతో ప్రయోజనకరమని జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి అన్నారు. రెండో విడత మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె మండలంలోని దేశాయిపల్లి సప్పరాజ్ చెరువు, కొంరెడ్డిపల్లి బ్రాహ్మణచెరువు, రెడ్డిపల్లి రెడ్డిచెరువు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువుల్లో పూడికను తీ యించేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన బృ హత్తర కార్యక్రమమే మిషన్ కాకతీయ అన్నారు. దీనిని ప్రతి ఒక్క రైతూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సహకరించాలని తెలిపారు. గ్రామాల్లో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొందని, దీంతో ప్రజలు గ్రామాలను విడిచి వెళుతున్నారని ఎం పీపీ శాంతీబా యి.. చైర్‌పర్సన్ సునీతారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఆమె గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు కల్గకుండా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పరిగి అభివృద్ధిలో ఎంతో వెనుకబడిం దని, నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సునీతారెడ్డి వివరించారు.
అనంతరం గండేడ్‌లో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, రుసుంపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిం చారు. కార్యక్రమంలో గండేడ్ ఎంపీీ ప శాంతీబాయి, జెడ్పీటీసీ లక్ష్మి, వైస్ ఎం పీపీ రాధారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ సరితా లక్ష్మణ్, డిప్యూటీ సర్పంచ్ సలీం, ఎంపీటీసీలు చెన్నమ్మ, మంజుల, ఆశన్న, నాయకులు గోపాల్‌రెడ్డి, బాలవర్దన్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ రామార్జున్, ఏఈఈ శివరాం, ఎంపీడీఓ కాళుసింగ్, తహశీల్దార్ శ్రీనివాస్‌రావు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.