తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలను గురువారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తిలకించారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా జరుగుతున్నాయి. గురువారం నాలుగు పళ్ల విభాగంలో జరిగిన పోటీలకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. ఈ పోటీలు వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగనున్నాయి.