రైతులను బిచ్చగాళ్లుగా చేస్తారా?: సురవరం
చింతపల్లి : ప్రాజెక్టుల పేరుతో భూములను లాక్కుని రైతులను బిచ్చగాళ్లుగా చేస్తారా అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా ఘడియగౌరారం గ్రామంలో ఉజ్జిని నారాయణరావు స్మారక స్తూపాన్ని ఆదివారం ఆవిష్కరించి సంస్మరణ సభలో మాట్లాడారు.
బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజలకు వ్యతిరేకంగా మారిందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఉద్యమాలకు సిద్ధమవుతోందని సురవరం తెలిపారు.