- పోలీసుల అదుపులో తమ్ముడు
శింగనమల : సోదనపల్లి గ్రామ శివారులోని పొలంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన మాంచాల పెద్దయ్య (40)కు 20 ఏళ్ల కిందట వివాహమైంది. రెండేళ్లకే భార్య వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతడు తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. తాగుడుకు అలవాటుపడిన పెద్దయ్య ప్రతిరోజూ తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. సోమవారం ఉదయం గ్రామశివారులోని పొలంలో పెద్దయ్య విగతజీవిగా పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ హమీద్‌ఖాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుడికాలు విరిగి, చెయ్యి, కంటి వద్ద గాయాలైన ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల అదుపులో తమ్ముడు : మాంచాల పెద్దయ్య మృతిపై తమ్ముడు గిరప్పను పోలీసులు అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా.. ఆదివారం రాత్రి అన్నతో గొడవపడినట్లు, కట్టెతో కాలు విరగ్గొట్టి పొలంలో వదిలేయడంతో దాహంతో అలమటించి చనిపోయి ఉంటాడని గిరప్ప ఒప్పుకున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.