మూడు రోజుల పాటు స్వచ్ఛ్ భద్రాచలం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఖమ్మం : మూడు రోజుల పాటు స్వచ్ఛ్ భద్రాచలం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గోదావరి పుష్కరాలు నేడు అఖరి రోజు కావడంతో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పుష్కర ఘాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం తుమ్మల విలేకర్లతో మాట్లాడుతూ.. రేపటి నుంచి మూడు రోజులపాటు పుష్కర ఘాట్లు మూసివేస్తున్నట్లు తెలిపారు.
అలాగే రేపటి నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14వ తేదీన గోదావరి పుష్కరాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భద్రచలం పోటెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం భక్తుల కోసం భద్రచలంలో స్పెషల్ బస్సు ఏర్పాటు చేసింది.