
చిన్నారులపై శ్రద్ధ అవసరం
సమాజంలో చిన్నారుల పరిరక్షణ చాలా ముఖ్యమని సబ్‌కలెక్టర్ డాక్టర్ సలోని సిదాన అన్నారు. శనివారం సబ్–కలెక్టర్ కార్యాలయంలో బాలల న్యాయ చట్టం- 2015పై జిల్లా స్థాయి వర్క్‌షాపును ఆమె ఽప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి విద్యతోపాటు రక్షణ కల్పించాల్సిన అవశ్యకత ఉందన్నారు.
విజయవాడ : సమాజంలో చిన్నారుల పరిరక్షణ చాలా ముఖ్యమని సబ్‌కలెక్టర్ డాక్టర్ సలోని సిదాన అన్నారు. శనివారం సబ్–కలెక్టర్ కార్యాలయంలో బాలల న్యాయ చట్టం- 2015పై జిల్లా స్థాయి వర్క్‌షాపును ఆమె ఽప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి విద్యతోపాటు రక్షణ కల్పించాల్సిన అవశ్యకత ఉందన్నారు. 16 ఏళ్లు పైబడిన బాలలు హేయమైన నేరాలకు పాల్పడినప్పుడు జువైనల్ జస్టిస్ బోర్డు సెక‌్షన్ 15 ప్రకారం ఆ బాలుడు నేరం చేయటానికి శారీరక, మానసిక శక్తిని బోర్డు ప్రాథమిక అంచనావేస్తుందని సబ్‌కలెక్టర్ వివరించారు. నేరం, పర్యావసనాలు, ఆ నేరం జరిగాక తలెత్తె పరిస్థితులపై బాలురకున్న సామరా్థ ్యన్ని అంచనా వేసి చిల్డ్రన్ కోర్టుకు బదిలీ చేసే విధంగా చట్టం ఉందన్నారు. సమావేశంలో డిప్యూటీ పోలీసు కమిషనర్ జి.వి.జి.అశోక్ కుమార్ మాట్లాడుతూ దైనందిన జీవితాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా తీర్చిదిద్దుతారో అదే విదంగా సంరక్షణ, రక్షణ అవసరమైన బాలలను కూడా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. పిల్లలు ఏదైనా నేరం చేస్తే చట్టపరంగా అవలంబించాల్సిన పద్ధతులను పోలీసులతో పాటు సంబంధిత శాఖలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. విజయవాడ అతిపెద్ద రైల్వే జంక‌్షన్‌లో జీవనోపాధికి ఇతర కారణాలవల్ల బాలలు రావటవం జరుగుతోందన్నారు. అలాంటి వారిపై చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు బాధ్యతగా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ చిన్నతనం నుంచి పిల్లలకు చదువుతోపాటు క్రమశిక్షణ పెంచితే చట్టాల అవసరం ఉండదన్నారు. జిల్లా స్త్రీశిశు సంక్షేమ అధికారిణి కె. కృష్ణకుమారి మాట్లాడుతూ బాలల న్యాయ చట్టం 2015పై అవగాహన కల్పించటానికి సంబందిత శాఖలతోపాటు స్వచ్ఛంద సేవల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్‌ప్రొటక్షన్ అధికారులు ఎన్‌జీవో ప్రతినిధులు నగేష్, ప్రాన్సిస్ తంబి పాల్గొన్నారు.