sub collector office
-
పచ్చ మీడియా డైరెక్షన్..పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటన అనంతరం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఫైళ్లు కాలిపోతే రెవెన్యూ కార్యాలయాల్లో డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా? ఆర్డీవో, సీసీఎల్ఏ కార్యాలయాల్లో సంబంధిత రికార్డులు భద్రంగానే ఉంటాయి. కనీసం ఫైళ్ల వెరిఫికేషన్ చేయకపోవడం.. ఉన్నతాధికారులను హుటాహుటిన హెలికాఫ్టర్‌లో పంపి అక్కడేదో జరిగిపోయిందనే అనుమానాలు రేకెత్తించడం.. అనుమానితుల పేరుతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు, విచారణ పేరుతో బెదిరించడం.. ప్రజలను రెచ్చగొట్టడం.. పూర్తిగా ఓ వర్గం మీడియా డైరెక్షన్లో దర్యాప్తు సాగడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.» ఘటన జరిగిన మర్నాడే ఈనెల 22న సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్వయంగా డీజీపీ, సీఐడీ చీఫ్‌లు హెలికాప్టర్లో మదనపల్లె చేరుకుని విచారణ చేపట్టారు. కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య రహస్యంగా విచారణ చేపట్టినట్లు చెబుతున్నా ఆ వివరాలన్నీ ఎల్లో మీడియాకు లీక్ కావడం గమనార్హం. ఆ కథనాల ఆధారంగా దాడులు, విచారణలు సాగుతుండటంతో ఇక విచారణ ఎంత నిష్పాక్షపాతంగా సాగుతుందో ఊహించవచ్చు. డీజీపీ, సీఐడీ చీఫ్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా మీడియాను అనుమతించని పోలీసులు టీడీపీ నేతల కార్లను మాత్రం సాదరంగా లోపలికి పంపారు. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు వారు వచ్చినట్లు స్పష్టమవుతోంది. » విచారణ మొదలైన తొలిరోజు సాయంత్రం ఎల్లో మీడియాను మాత్రమే లోపలకు అనుమతించారు. అంతకుముందు టీడీపీ నేతలను లోపలకు పంపారు. వారితో ఉన్నతాధికారులు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. » అటు వార్తలు.. ఆపై దాడులు ఎల్లో మీడియాలో వైఎస్సార్ సీపీ నాయకుల గురించి వార్తలు రావడమే ఆలస్యం పోలీసులు దాడులు, తనిఖీలకు దిగుతున్నారు. ఈనెల 23న వైఎస్సార్సీపీకి చెందిన మాధవరెడ్డిపై ఈనాడులో వార్త రాగానే పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. అదే పత్రికలో ఈనెల 25న వైఎస్సార్సీపీకి చెందిన మరోనాయకుడు బాబ్జాన్ గురించి కథనం ప్రచురించడంతో పోలీసులు ఆయన ఇంటిపై దాడులకు దిగి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. మాజీ ఎమ్మెల్యేను విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ 28న పరోక్షంగా నవాజ్ బాషానుద్దేశించి కథనాన్ని వెలువరించడంతో ఉదయమే పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు తనిఖీల పేరుతో హడావుడి సృష్టించారు. » శనివారం మదనపల్లె మున్సిపల్ వైస్‌చైర్మన్ జింకా వెంకటా చలపతి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి తర్వాత వదిలేశారు. మరో నాయకుడు బండపల్లి అక్కులప్ప విచారణ హాజరు కాగా ఎల్లో మీడియాలో హంగామా సృష్టించారు.ఎలాంటి తప్పు చేయలేదు – మాజీ ఎమ్మెల్యే నవాజ్బాషాఐదేళ్ల పదవీకాలంలో ఎక్కడా కబ్జాలు, అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి తప్పు చేయలేదని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా స్పష్టం చేశారు. శనివారం రాత్రి తాను బెంగళూరులో ఉన్న సమయంలో 22(ఏ) నిషేధిత భూముల బదలాయింపులకు సంబంధించిన ఆరోపణలపై తన నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. తాను ఆదివారం ఉదయం వస్తున్నట్లు చెప్పి తనిఖీలకు సహకరించినట్లు తెలిపారు. రెవెన్యూ, ప్రభుత్వ శాఖల్లో అవినీతికి తావు లేకుండా వైఎస్సార్ సీపీ హయాంలో పారదర్శక పాలన అందించినట్లు గుర్తు చేశారు. ఎక్కడా తలదించుకునేలా వ్యవహరించలేదన్నారు.పెద్దిరెడ్డి పీఏ ఇంట్లో సోదాలుటాస్క్ఫోర్స్: మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్న పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ నివాసంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో పది మంది పోలీసులు పాల్గొన్నారు. -
పట్టించుకుంటే ఒట్టు.. ప్రజలకు గ్రహపాటు!
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం సబ్‌కలెక్టర్ కార్యాల యం.. ఐఏఎస్ అధికారి పాలన.. నిత్యం అక్కడకు పలు సమస్యలతో వచ్చే జనం.. 12 మండలాలున్న డివిజన్‌కు ప్రధాన కార్యాలయం.. నిత్యం సమీక్షలు, సమావేశాలు. సోమవారం వచ్చిందంటే మీకోసం కార్యక్రమం వద్ద అర్జీదా రుల హడావుడి.. ఇదంతా గతం.. ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తొమ్మిది నెలలు నుంచి పట్టించుకునే నాథుడు లేకుండా సబ్‌కలెక్టర్ కార్యాలయం తయారయ్యింది. అక్కడకు వెళ్లిన వారికి కనీసం సమాధానం చెప్పేందుకు కూ డా ఎవరూ లేని పరిస్థితి ఎదురవుతుంది. మొత్తం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం డెప్యూటీ తహసీల్దార్ ర్యాంకులో ఉన్న నరేష్కుమార్ ఇన్చార్జి ఏఓగా పనిచేస్తున్నారు. కనీసం తహసీల్దార్ స్థాయి అధికారి కూడా కార్యాలయంలో లేకపోవడంతో డివిజన్లో పరిపాలన పూర్తిగా కుంటుపడింది. సబ్‌కలెక్టర్ కార్యాలయం ఇంత దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొన్న సందర్భంగా గతంలో ఎప్పుడూ లేదని చెబుతున్నారు. జిల్లాలో కీలకమైన ఈ రెవెన్యూ డివిజన్లో సబ్‌కలెక్టర్‌తో సహా పలు పోస్టులు ఖాళీఅయ్యాయి. సోమవారం మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు తీసుకోవడానికి కనీసం తహసీల్దార్ స్థాయి అధికారి కూడా అందుబాటులో లేరు. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం అవస్థలు పడుతున్నారు. చివరకు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు ఇవ్వకుండా కూడా జనం వెనుదిరుగుతున్నారు. సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ గతేడాది మే 6న బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇక్కడ ఎవరినీ నియమించలేదు. కొవ్వూరు ఆర్డీఓను ఇన్చార్జ్గా నియమించినా కూడా ఆయన ఇక్కడ కార్యాలయం మెట్లెక్కిన సందర్భాలు తక్కువే. కార్యాలయ ఏఓ పీఎన్ఎస్ లక్ష్మి, కేఆర్సీ తహసీల్దార్ గొంతియ్య కూడా బదిలీ అయ్యారు. భర్తీ ఎప్పటికో..! సబ్‌కలెక్టర్ పోస్టుపై రాజకీయ ముసురు అల్లుకుంది. ఇక్కడ ఐఏఎస్‌ను నియమించడంపై డెల్టాలోని కొందరు ఎమ్మెల్యేలు అభ్యతరం చెప్పినట్టు సమాచారం.అప్పటి నుంచి పోస్టును ఖాళీగా పెట్టారు. పోనీ పూర్తిస్థాయి ఆర్డీఓను కూడా నియమించలేదు. ఓవైపు ఎన్నికల సమీపిస్తున్నాయి. సబ్‌కలెక్టర్ లేకపోవడంతో ఇప్పటికే డివిజన్లో ఓటరు జాబితాల తయారీ తప్పుల తడకగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో రెవెన్యూ శాఖలోకింద స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలనోటిఫికేషన్‌కు కూడా సమయం దగ్గరపడుతుంది. మరి ప్రభుత్వం సబ్‌కలెక్టర్ పోస్టును ఎప్పటికి భర్తీ చేస్తారో చూడాలి మరి. -
చిన్నారులపై శ్రద్ధ అవసరం
విజయవాడ : సమాజంలో చిన్నారుల పరిరక్షణ చాలా ముఖ్యమని సబ్‌కలెక్టర్ డాక్టర్ సలోని సిదాన అన్నారు. శనివారం సబ్–కలెక్టర్ కార్యాలయంలో బాలల న్యాయ చట్టం- 2015పై జిల్లా స్థాయి వర్క్‌షాపును ఆమె ఽప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి విద్యతోపాటు రక్షణ కల్పించాల్సిన అవశ్యకత ఉందన్నారు. 16 ఏళ్లు పైబడిన బాలలు హేయమైన నేరాలకు పాల్పడినప్పుడు జువైనల్ జస్టిస్ బోర్డు సెక్షన్ 15 ప్రకారం ఆ బాలుడు నేరం చేయటానికి శారీరక, మానసిక శక్తిని బోర్డు ప్రాథమిక అంచనావేస్తుందని సబ్‌కలెక్టర్ వివరించారు. నేరం, పర్యావసనాలు, ఆ నేరం జరిగాక తలెత్తె పరిస్థితులపై బాలురకున్న సామరా్థ ్యన్ని అంచనా వేసి చిల్డ్రన్ కోర్టుకు బదిలీ చేసే విధంగా చట్టం ఉందన్నారు. సమావేశంలో డిప్యూటీ పోలీసు కమిషనర్ జి.వి.జి.అశోక్ కుమార్ మాట్లాడుతూ దైనందిన జీవితాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా తీర్చిదిద్దుతారో అదే విదంగా సంరక్షణ, రక్షణ అవసరమైన బాలలను కూడా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. పిల్లలు ఏదైనా నేరం చేస్తే చట్టపరంగా అవలంబించాల్సిన పద్ధతులను పోలీసులతో పాటు సంబంధిత శాఖలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. విజయవాడ అతిపెద్ద రైల్వే జంక్షన్లో జీవనోపాధికి ఇతర కారణాలవల్ల బాలలు రావటవం జరుగుతోందన్నారు. అలాంటి వారిపై చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు బాధ్యతగా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ చిన్నతనం నుంచి పిల్లలకు చదువుతోపాటు క్రమశిక్షణ పెంచితే చట్టాల అవసరం ఉండదన్నారు. జిల్లా స్త్రీశిశు సంక్షేమ అధికారిణి కె. కృష్ణకుమారి మాట్లాడుతూ బాలల న్యాయ చట్టం 2015పై అవగాహన కల్పించటానికి సంబందిత శాఖలతోపాటు స్వచ్ఛంద సేవల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్ప్రొటక్షన్ అధికారులు ఎన్జీవో ప్రతినిధులు నగేష్, ప్రాన్సిస్ తంబి పాల్గొన్నారు. -
16న కుక్కునూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి
వేలేరుపాడు : పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఈనెల 16న కుక్కునూరులో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు రాష్ట్ర సీపీఐ కౌన్సిల్ సభ్యుడు ఎండీ మునీర్ తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పిట్టా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతంలో ప్రజలు అనేక సమస్యలతో తల్లడిల్లిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడంలేదని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి అన్ని గ్రామాల నిర్వాసితులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. 16న జరిగే సబ్ కలెక్టర్ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. వేలేరుపాడు మండలంలో 9 గ్రామ పంచాయతీలను యూనిట్‌గా తీసుకుని ముంపు గ్రామాలుగా ప్రకటించాలని, ఆయా గ్రామాల్లో గిరిజన, గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న అన్నిరకాల భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సన్నేపల్లి సాయిబాబా, ఏఐటీయూసీ కార్యదర్శి కారం దారయ్య, గోలి వెంకన్నబాబు, బాడిశ రాము, ఇందిర, కుమారి పాల్గొన్నారు. -
విజయవాడలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
విజయవాడ: నగరంలోని బందరురోడ్డులో ఉన్న సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాలు తెలియలేదు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలిసింది. -
బెజవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
బెజవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలంటూ బెజవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని శుక్రవారం మున్సిపల్ జేఏసీ ఉద్యోగులు ముట్టడికి యత్నించారు. అందుకోసం భారీగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు చేరుకున్నారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో మున్సిపల్ నేతలు, కార్మికులు ఆగ్రహించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం అది కాస్తా వాగ్వాదంగా మారింది. ఈ నేపథ్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. -
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళన
విజయవాడ: ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.లక్ష లోపు రుణ మాఫీ చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించడం పట్ల డ్వాక్రా మహిళలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ బుధవారం విజయవాడ నగరంలో డ్వాక్రా మహిళలు కదంతొక్కారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలకు... ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ బుధవారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు. -
సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్య
జగిత్యాల, న్యూస్‌లైన్: కరీంనగర్ జిల్లా జగిత్యాల సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పెగడపల్లి మండలం నామాపూర్‌కు చెందిన గాండ్ల సుధాకర్(49) తన తండ్రి పేరున ఉన్న 1.36 ఎకరాల భూమి, తన వదిన పాపమ్మ పేరిట మారిందని, ఆ భూమిని తిరిగి తన తండ్రి పేరున మార్చాలని 1992లో రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. కానీ, అధికారులు స్పందించలేదు. 2007 నుంచి భూమి మార్పిడి కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. 2010లో తన సోదరి మణెమ్మతో జగిత్యాల సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కేసు వేయించాడు. ఈ కేసు విషయమై శనివారం సబ్‌కలెక్టర్ ఎదుట పాపమ్మ హాజరు కావాల్సి ఉండగా, ఆమె సదరు భూమి తనదేనంటూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కేసును సబ్ కలెక్టర్ శ్రీకేశ్ లట్కర్ వాయిదా వేశారు. ఇక భూమి తనకు దక్కే పరిస్థితి లేదని మనస్తాపం చెందిన సుధాకర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో క్రిమిసంహారక మందు తాగి లోపలికి వెళ్లే క్రమంలో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ చనిపోయాడు. -
నష్టపరిహారం పెంచాల్సిందే
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : బందరు రోడ్డు విస్తరణలో భూమి కోల్పోతున్న నిర్వాసితులు నష్టపరిహారం పెంచాలని ఆందోళన చేశారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వాసితులకు పరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితుల నిరసన నడుమ అధికారులు చెక్కులను పంపిణీ చేశారు. బెంజిసర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కంకిపాడు మండలం ఈడ్పుగల్లు గ్రామంలో స్థలాలు కోల్పోతున్న 101 మంది నిర్వాసితులకు పరి హారం పంపిణీ చేయడానికి సబ్‌కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈడ్పుగల్లులో 34,454.13 చదరపు మీటర్ల స్థలానికి సంబంధించి నిర్వాసితులకు అధికారులు పరిహార చెక్కులు తయారు చేశారు. కాగా చెక్కులు పంపిణీ చేయటానికి వచ్చిన సబ్‌కలెక్టర్ డి.హరిచందన వద్ద నిర్వాసితులు తక్కువ పరిహారం మంజూరు చేసి తమకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. న్యాయమైన ధర ఇచ్చేవరకు పరిహారం తీసుకునేది లేదన్నారు. 2007లో రూపొందించిన చట్టం ప్రకారం గజానికి రూ. 2,700 పరిహారం ఇవ్వటం వల్ల తాము నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చట్టం ప్రకారం గజానికి రూ.5,500లు చెల్లించాలని డిమాండ్ చేశారు. సబ్‌కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. కొత్త చట్టం జాతీయ రహదారులకు వర్తించదన్నారు. ముందుగా తాము ఇచ్చిన చెక్కులను తీసుకుని అదనపు పరిహారం కోసం ప్రయత్నించాలని సూచించారు. దీంతో ఆందోళన కారులు శాంతించి చెక్కులను తీసుకున్నారు. కొందరు నిర్వాసితులు మాత్రం తమకు చెక్కులు వద్దని వెనక్కి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు తహశీల్దార్ రోజా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.