తమ సమస్యలు పరిష్కరించాలంటూ బెజవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని శుక్రవారం మున్సిపల్ జేఏసీ ఉద్యోగులు ముట్టడికి యత్నించారు.
విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలంటూ బెజవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని శుక్రవారం మున్సిపల్ జేఏసీ ఉద్యోగులు ముట్టడికి యత్నించారు. అందుకోసం భారీగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు చేరుకున్నారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో మున్సిపల్ నేతలు, కార్మికులు ఆగ్రహించారు.
దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం అది కాస్తా వాగ్వాదంగా మారింది. ఈ నేపథ్యంలో సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.