సింహాచలంలో తలనీలాలు చోరీ
సింహాచలం: మొక్కుల రూపంలో దేవునికి సమర్పించుకున్న తలనీలాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన విశాఖపట్నం సింహాచలం దేవస్థానంలో సోమవారం వెలుగుచూసింది. ఆలయంలోని కేశఖండనశాలలో గ్రేడింగ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 బస్తాల తలనీలాలను దుండగులు అపహరించుకుపోయారు. ఇది గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. చోరీకి గురైన తలనీలాల విలువ సుమారు రూ. 8 లక్షల వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.