తలారికి త్రుటిలో తప్పిన ప్రమాదం
తలారికి త్రుటిలో తప్పిన ప్రమాదం
Published Fri, Jan 6 2017 10:40 PM | Last Updated on Tue, May 29 2018 5:25 PM
అనంతపల్లి(నల్లజర్ల): వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో నల్లజర్ల మండలం శింగరాజుపాలెంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ముగించుకుని వెంకట్రావు కారులో స్వగ్రామం దేవరపల్లి వెళ్తుండగా అనంతపల్లి ఎర్రకాలువ బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి ఎదురుగా వాహనం వచ్చింది. దీంతో ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి కారును ఎడమవైపునకు తిప్పి వంతెన దిమ్మెను ఢీకొన్నారు. ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. స్టీరింగ్ ఆయన ఛాతీని బలంగా తాకడంతో స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను తాడేపల్లిగూడెం ప్రసాద్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అనంతరం వెంకట్రావు దేవరపల్లి చేరుకున్నారు. డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పడంతో నల్లజర్ల మండలంలో జరగాల్సిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నియోజకవర్గంలోని నాయకులు శుక్రవారం తలారి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
Advertisement
Advertisement