మళ్లీ మొదలైన మట్టి దోపిడీ
మళ్లీ మొదలైన మట్టి దోపిడీ
Published Thu, Nov 10 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
పట్టపగలే జోరుగా అక్రమ రవాణా
మండలస్థాయి నాయకుడి అండదండా
పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
తాళ్లరేవులో మట్టి దోపిడీ మళ్లీ మొదలైంది. స్థానిక ఆత్రేయ గోదావరిలో డ్రెడ్జింగ్ ద్వారా తవ్వి తీసిన మట్టిని అక్రమార్కులు దర్జాగా తరలించుకుపోతున్నారు. పట్ట పగలే పొక్లెయి¯ŒS ద్వారా మట్టిని టిప్పర్‌లలో వేసి తరలిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకో వడం లేదు. మండల స్థాయి నాయకుని అండదండలతో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
– తాళ్లరేవు
మురుగుకాలువల అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.25 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఆత్రేయ డ్రెయిన్ డ్రెడ్జింగ్ పనులను నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టింది. డ్రెడ్జింగ్ ద్వారా వెలికితీసిన మట్టిని గోదావరి చెంతన గట్లపైన, సమీప పల్లపు ప్రాంతాలలోనూ వేస్తున్నారు. ఈ మట్టిని గట్లపై వేయడం ద్వారా గోదావరి గట్లు పటిష్టమవుతాయని గోదావరి చెంతనగల రైతులు, ప్రజలు ఆనం దం వ్యక్తం చేశారు. అయితే గతంలో కొందరు అక్రమార్కులు, అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై లక్షలాది రూపాయల విలువైన మట్టిని దర్జాగా యంత్రాల సాయంతో తవ్వి లారీలు, టిప్పర్‌లలో తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ భాగోతంపై పలువురు ఫిర్యాదు చేయడంతో మట్టి తరలింపు నిలిచిపోయింది. అయితే రెండు రోజులుగా అక్రమార్కులు మళ్లీ మట్టి అక్రమ తరలింపునకు తెరతీశారు. నిత్యం అనేక టిప్పర్‌లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
ఏటిగట్టును ఛిద్రం చేస్తున్నారు
ఆత్రేయ గోదావరి చెంతనే అనేక గ్రామాలు ఉన్నాయి. వాటితో పాటు వేలాది ఎకరాల వరి ఆయకట్టు ఉంది. వరదల సమయంలో ఆయా గ్రామాలకు, వరి ఆయకట్టుకు ఎటువంటి నష్టం కలుగకుండా ఏటిగట్లు కాపాడుతూ ఉంటాయి. అటువంటి గట్లను ఇష్టానుసారం తవ్వేసి అక్రమార్కులు మట్టిని తరలించుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఏటిగట్లను పటిష్టం చేస్తుంటే మరోపక్క ఏటిగట్లపై ఉన్న మట్టిని దర్జాగా తరలించుకు పోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు తక్షణమే స్పందించి మట్టి అక్రమ తరలింపును నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement