మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాస | tdp corporators hulchul in rajamahendravaram municipal corporation | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాస

Published Sat, May 21 2016 12:50 PM | Last Updated on Sat, Aug 11 2018 4:24 PM

tdp corporators hulchul in rajamahendravaram municipal corporation

రాజమహేంద్రవరం : ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నిలదీయటంతో టీడీపీ నేతలు తట్టుకోలేకపోయారు. ఇష్టముంటే ఉండండి..లేకుంటే వెళ్లిపొండి.. అంటూ నోరుపారేసుకున్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.... తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ప్రస్తావించారు. వాటిని పరిష్కరించటంలో అధికార పక్షం విఫలమైందని వారు ఆరోపించారు. దీంతో టీడీపీ ఫ్లోర్ లీడర్ వర్రె శ్రీనివాస్ ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. అధికారం మాది.. మీరు బయటకు పొండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు. దీనిపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement