ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న సీతక్క
ఖమ్మం అర్బన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ముందుగా, పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీగా ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. ధర్నాలో ముఖ్య అతి«థిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దనసరి సావిత్రి (సీతక్క) పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని ప్రభుత్వ అధికారులు, మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. భూనిర్వాసితుల పరిహారానికి సంబంధించి 123 జీఓను హైకోర్టు కొట్టివేయడంపై పై కోర్టుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడాన్నిబట్టి.. ౖరైతులపై ఆయనకుగల ప్రేమ ఏపాటితో తేటతెల్లమైందని అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుల్లూరి బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ సగం గడిచినప్పటికి కూడా రుణ మాఫీ మొత్తాన్ని జమ చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని అన్నారు. ఎంసెట్–2 లీకేజీలో కేసీఆర్ సమీప బంధువుల హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నప్పటికీ టీఆర్‌ఎస్ పెద్దలుగానీ, ప్రభుత్వంగానీ స్పందించడం లేదని విమర్శించారు. ధర్నా అనంతర ం జాయింట్ కలెక్టర్‌కు నాయకులు వినతిపత్రమిచ్చారు. ధర్నాలో పార్టీ ఉపా«ధ్యక్షుడు గొర్ల సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణమూర్తి, నాయకులు కురపాటి వెంకటేశ్వర్లు, తోటకూరి శివయ్య, ఏలూరి శ్రీనివాసరావు, రామనాధం, స్వర్ణకుమారి, భవానిశంకర్, రాందాస్, ఫణీశ్వరమ్మ, వెంకటరామయ్య, అప్పారావు, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, తాళ్లూరి జీవన్‌కుమార్, వాకదాని కోటేశ్వరరావు, జట్ల శ్రీను, గొల్లపూడి హరిక్రిష్ణ, సుమంత్, గొడ్డెటి మాధవరావు, భిక్షపతి, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.