హామీల అమలులో ప్రభుత్వం విఫలం | TDP leader Revuri Prakash Reddy fires on CM KCR | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Published Tue, Nov 8 2016 3:35 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

హామీల అమలులో ప్రభుత్వం విఫలం - Sakshi

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

నల్లగొండ రూరల్ : ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్ అధ్యక్షతన నూతన కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి నాంది అన్నారు. మాటల గారడీతోనే రాష్ట్ర ప్రజానీకానికి మాయచేస్తుందన్నారు. అధికారులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత భావంతో ఉన్నారని అన్నారు.
 
  పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉన్నామని అన్నారు.    సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తు ఎన్నికల నాటికి అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించాలన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో   ఈనెల 12 న పెద్దపల్లి జిల్లాలో, 15న సూర్యాపేట జిల్లాలో నిర్వహిస్తున్న రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్ష 20వేల పార్టీ  సభ్యత్వం ఉందని, దీని కంటే ఎక్కువగా సభ్యత్వాన్ని నమోదు చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, నాయకులు వంగాల స్వామిగౌడ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, రజనీకుమారి, బంటు వెంకటేశ్వర్లు, కర్నాటి విద్యాసాగర్, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ఎండి.యూసుఫ్, సాధినేని శ్రీనివాస్, నెల్లూరి దుర్గాప్రసాద్, మధుసూధన్‌రెడ్డి, పిల్లిరామరాజు యాదవ్, దేప వెంకటరెడ్డి, అయితగోని యాదగిరిగౌడ్, లొడంగి గోవర్ధన్ పాల్గొన్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement