మిందిలో అధికారపార్టీ సాక్షిగా ..
అక్కిరెడ్డిపాలెం: సంక్రాంతి సందర్భంగా మిందిలో అధికారపార్టీ సాక్షిగా కోడి పందాలు జోరుగా సాగాయి. శనివారం, ఆదివారం సాగిన కోడి పందాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నల్లోనే ఈ కోడి పందాలు స్వేచ్ఛగా సాగాయి. ఎవరికి అందాల్సిన మామూళ్లు వారికి అందాయంటూ టీడీపీ నేతలు బాహాటంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పోలీసులు బస్టాండ్ వద్దే చోద్యం చూస్తూ నిలబడడం విమర్శలకు దారితీసింది. గాజువాక పరిసర ప్రాంతాల నుంచి భారీగా బెట్టింగ్ రాయుళ్లు ఈ పందాల్లో పాల్గొన్నారు.