‘వాళ్లకు బ్లాక్‌డే..ప్రజలకు మాత్రం గోల్డెన్ డే’ | telangana minister harish rao speaks over congress leader comments on maharastra projects | Sakshi
Sakshi News home page

‘వాళ్లకు బ్లాక్‌డే..ప్రజలకు మాత్రం గోల్డెన్ డే’

Published Wed, Mar 9 2016 6:16 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

‘వాళ్లకు బ్లాక్‌డే..ప్రజలకు మాత్రం గోల్డెన్ డే’ - Sakshi

‘వాళ్లకు బ్లాక్‌డే..ప్రజలకు మాత్రం గోల్డెన్ డే’

మెదక్: ‘సీఎం కేసీఆర్ తెలంగాణ సస్యశ్యామలం కోసం మహారాష్ట్రతో నీళ్ల ఒప్పందం చేస్తే కాంగ్రెసోళ్లు బ్లాక్‌డే అంటూ ప్రచారం చేస్తుండ్రు..కాంగ్రెసోళ్లకు బ్లాక్ డే... ప్రజలకు మాత్రం గోల్డెన్ డే..’ అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

మంగళవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో ఆయన పర్యటించారు. గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు, కుంటల అభివృద్ధి పనులను హరీష్రావు పరిశీలించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రులే అభినందిస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి ఉమాభారతి, ఢిల్లీ విద్యుత్ మంత్రి గోయల్ తెలంగాణను చూసి నేర్చుకోవాలని హితవు పలికినట్లు చెప్పారు. మిషన్ భగీరథతో తాగునీరు..మిషన్ కాకతీయతో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement