ఆకివీడు : స్థానిక శాంతినగర్‌లోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపల ఉన్న రెండు హుండీలను బయటకు తీసుకువచ్చి బద్దలకొట్టారు. వాటిల్లో ఉన్న సొమ్మును ఎత్తుకెళ్లారు.
వినాయకగుడిలో హుండీ చోరీ
Sep 9 2016 2:21 AM | Updated on Aug 30 2018 5:27 PM
ఆకివీడు : స్థానిక శాంతినగర్‌లోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపల ఉన్న రెండు హుండీలను బయటకు తీసుకువచ్చి బద్దలకొట్టారు. వాటిల్లో ఉన్న సొమ్మును ఎత్తుకెళ్లారు. సుమారు రూ.50వేలకుపైగా సొమ్ము ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ నందిగామ ఫణిశర్మ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ అశోక్‌కుమార్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వెనుక లభ్యమైన హుండీలను పరిశీలించారు. గతంలో ఇదే ఆలయంలో రెండు సార్లు హుండీలను దుండగులు దొంగిలించారు. గత ఏడాది డిసెంబర్ 26న హుండీని దోచుకున్న దొంగలను ఇప్పటికీ పట్టుకోలేదు. దీంతో తరచూ హుండీల దొంగతనాలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ కార్యదర్శి గంధం ఉమ ఎస్‌ఐతో చెప్పారు.
Advertisement
Advertisement