టెస్ట్ ట్యూబ్ బేబిలు
టెస్ట్ ట్యూబ్ బేబిలు
Published Mon, Apr 3 2017 10:46 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
-ఓకేసారి కవలలు జననం
– నంద్యాలలో ప్రథమం
– నెరవాటి హాస్పిటల్ వైద్యుల ఘనత
నంద్యాల వ్యవసాయం: టెస్ట్‌ట్యూబ్ బేబి విధానంలో కవల పిల్లలు (బాబు, పాప) జన్మించారు. ఈ అరుదైన ఘటన సోమవారం నంద్యాల నెరవాటి ఆసుపత్రిలో జరిగింది. పాణ్యం మండలం నెరవాడ గ్రామానికి చెందిన కె.లలిత, కె.విశ్వనాథరెడ్డిలకు 8ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కలగకపోవడంతో పలువురు డాక్టర్లను ఆశ్రయించారు. అయినా, ఫలితం లేకపోవడంతో టెస్ట్ బ్యూబ్‌బేబి ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకున్నారు.
గత ఏడాది నెరవాటి హాస్పిటల్ వైద్యులు వినోద్‌కుమార్, అరుణకుమారిలను సంప్రదించగా వారు చికిత్స ప్రారంభించారు. సోమవారం లలితకు నొప్పులు రావడంతో భర్త హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. కడుపులో ఇద్దరు పిల్లలు ఉండటంతో సాధారణ కాన్పు కష్టమైంది. దీంతో సిజేరియన్ చేసి బయటకు తీశారు. ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. కాగా ఆపరేషన్‌లో మత్తు మందు డాక్టర్ రవికృష్ణ, చిన్నపిల్లల వైద్యుడు పెసల అశోక్‌కుమార్ సహకారం అందించారు. టెస్్టట్యూబ్ బేబి ద్వారా కవలలు జన్మించడం నంద్యాలలోనే ప్రథమమని వైద్యులు వెల్లడించారు.
Advertisement