mpp
ఎంపీపీపై దాడి
Published Sat, Aug 27 2016 11:20 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
– భార్య, కుమారునితో కలిసి ఎంపీపీని అడ్డగించిన అధికార పార్టీ ఎంపీటీసీ
– ప్రతిపక్షానికి చెందిన ఎంపీపీని ఉద్దేశపూర్వకంగా దుర్భాషలాడిన నిందితులు
– చిరిగిన చొక్కా.. కమిలిన శరీరంతో నేరుగా పోలీసుస్టేçÙన్‌కు వెళ్లిన క్షతగాత్రుడు
– పోలీసుస్టేçÙన్ ఎదుట ఆందోళనకు దిగిన వైఎస్సార్ సీపీ నేత బుర్రా, ఇతర నేతలు
– నిందితులు ముగ్గురినీ అరెస్టు చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిక
పీసీపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పీసీపల్లి మండల పరిషత్ అధ్యక్షునిపై టీడీపీ ఎంపీటీసీ సభ్యుని కుటుంబ సభ్యులు అకారణంగా దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన అదే మండలం మురుగమ్మిలో శనివారం జరిగింది. వివరాలు.. ఎంపీపీ బత్తుల అంజయ్య స్వగ్రామం మురుగమ్మి. ఆయన తన ఇంటి నుంచి బైకుపై పీసీపల్లి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్తున్నారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి భార్య ఓబులమ్మ ఎంపీపీని పిలిచి ఉద్దేశపూర్వకంగా వాగ్వాదానికి దిగింది. ముందే పథకం రచించుకున్న ఎంపీటీసీ కృష్ణారెడ్డి ఆయన కుమారుడు వెంకట్రావులు ఉన్నట్టుండి ఎంపీపీపై దాడికి దిగి గాయపరిచారు. ఆందోళన చెందిన ఎంపీపీ నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ కార్యకర్తలతో కలిసి హుటాహుటిన పోలీసుస్టేçÙన్‌కు వెళ్లి అంజయ్యను పరామర్శించారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఎంపీటీసీ కృష్ణారెడ్డి, ఆయన భార్య ఓబులమ్మ, కుమారుడు వెంకట్రావులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను వెంటనే అరెస్టు చేయాలి : బుర్రా
ఎంపీపీ అంజయ్యపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని బుర్రా మధుసూదన్ డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నంలోపు నిందితులను అరెస్టు చేయకుంటే పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో వచ్చి పోలీసుస్టేçÙన్‌ను ఎదుట ముట్టడిస్తామని హెచ్చరించారు. టీడీపీ నాయకులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని బుర్రా ధ్వజమెత్తారు. బీసీలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుస్టేçÜన్ ఎదుట బైటాయించి నినాదాలు చేశారు. ఎంపీపీ కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పార్టీ కన్వీనర్ గోపవరపు బొర్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వైఎం ప్రసాద్‌రెడ్డి, నాయకులు తాలూరి రమణారెడ్డి, యర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ డబ్బుగొట్టు మహేష్‌నాగ్, కో ఆప్షన్ సభ్యుడు నజీర్‌బాషా తదితరులు ఎంపీపీని పరామర్శించారు.
ఎంపీపీకి ఎంపీ వైవీ పరామర్మ
విషయం తెలుసుకున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తక్షణమే ఎంపీపీ అంజయ్యను ఫోన్‌లో పరామర్శించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులపై దాడులు చేయడం దారుణమన్నారు. బలహీన వర్గాలకు చెందిన ఎంపీపీపై దాడి చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement