హత్నూరు మండలం చింతల్‌చెరువులో దారుణం చోటుచేసుకుంది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. చింతలచెరువు గ్రామానికి చెందిన అంబటి కృష్ణ(25)ను అతడి బాబాయి వీరప్ప, వీరప్ప కుమారులు సుధాకర్, శ్రీకాంత్‌లు కలిసి హత్య చేశారు. ముగ్గురూ కలిసి కృష్ణ తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య అనంతరం సుధాకర్, శ్రీకాంత్‌లు పరారయ్యారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చింతల్‌చెరువులో యువకుడి దారుణహత్య
Published Tue, Jun 14 2016 1:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM
Advertisement
Advertisement