వృద్ధురాలి హత్య - బంగారు, నగదు చోరీ | The murder of elderly for gold , cash theft | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్య - బంగారు, నగదు చోరీ

Published Sun, May 8 2016 3:33 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

The murder of elderly  for gold , cash theft

మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో ఇమ్మడి మల్లవ్వ(80) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు హత్యచేసి రెండున్నర తులాల బంగారు, 50 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం వేకువ జామున జరిగింది. మల్లవ్వ కుమారుడు జయపాల్‌రెడ్డి సిద్ధిపేటలో స్కూల్ నడుపుతూ అక్కడే ఉంటున్నాడు.

వృద్దురాలు మాత్రం ఇంటిపట్టునే ఉంటూ వడ్డీవ్యాపారం చేస్తోంది. ఆదివారం వేకువ జామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆమె గొంతు నులిమి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు దోచుకున్నారు. అలాగే ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదు తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం 7 గంటలైనా వృద్దురాలు నిద్ర లేవకపోవడంతో ఇరుగుపొరుగువారు దొడ్డిదారి గుండా ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె చనిపోయి కనిపించింది. ఆమె మెడ వద్ద గాయాలు ఉన్నాయి. విషయం పోలీసులకు, ఆమె కుమారునికి చేరవేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement