మాట్లాడుతున్న ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఆదివాసీల కోసం పోరాటాలు చేసి వారి సమస్యలపై అనేక రచనలు చేసిన గొప్ప రచయిత మహా శ్వేతాదేవి అని, అందుకే ఆమె కలానికి అంత పదును వచ్చిందని ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు అన్నారు. ఆదివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక, ప్రజాస్వామిక రచయితల వేదిక, తెలంగాణ సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి మహా శ్వేతా దేవి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ..
అభూత కల్పనలు చెప్పకుండా వచనాన్ని గొప్పగా చెప్పే శక్తి ఆమెకు వచ్చిందని అన్నారు. గోపారాజు నారాయణ రాజు మాట్లాడుతూ హిరోషిమ ఘటన మానవత్వం మసి అయిపోయినట్లు అయిందని అన్నారు. ఈ సందర్భంగా కొడవాటి కుటుంబరావు అనువాదం చేసిన ‘ హిరోషిమా’ నవలను శివరాంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ఆవిష్కరించారు. స్త్రీ సంఘటన ఎడిటర్ యం.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయితలు భూపతి వెంకటేశ్వర్లు, భూపాల్, విమల, జనసాహితి అధ్యక్షులు రాంమోహన్ , కొండవీటి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.