జిల్లాపరిషత్, న్యూస్‌లైన్ : మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) పునర్విభజ నకు బ్రేక్ పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఏపీఎన్జీవోలతోపాటు సీమాం ధ్ర ఉద్యోగులు ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీస్ అందజేశారు. ఈ నేపథ్యంలో సీమాం ధ్రలోని అన్ని జిల్లాలకు చెందిన ఎంపీడీఓలు ఎన్జీవోలకు మద్దతుగా సమ్మె లో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మండల ప్రాదేశిక నియోజకవర్గాలను పునర్విభజన చేసేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ షెడ్యూలును ప్రకటించారు.
ఈనెల 14వ తేదీలోగా ఎంపీటీసీ స్థానాలు పునర్విభజన చేసి ఆయా జిల్లాల్లో గెజిట్ ప్రకటించాల్సి ఉంటుంది. అరుుతే సీమాంధ్ర ప్రాంతంలో ఎంపీడీఓలు సమ్మెలో పాల్గొంటున్నందున పునర్విభజనపై నీలినీడలు కమ్ముకున్నాయి. పునర్విభజన.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేసారి నిర్వహించి పబ్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలో పునర్విభజన జరిగి, మరో ప్రాంతంలో జరగకుంటే భవిష్యత్తులో రిజర్వేషన్లపై ఈ ప్రభావం పడే అవకాశాలున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పునర్విభజన ప్రక్రియ నిలిచిపోనున్నట్టు సమాచారం.
ఎంపీటీసీల పునర్విభజనకు బ్రేక్...
Published Sun, Aug 11 2013 1:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement