మూడు ఇళ్లలో చోరీ
-
రూ.1.05 లక్షల నగదు, ఎడున్నర తులాలు బంగారు అభరణాలు అపహరణ
-
తాళం వేసి ఉన్న ఇళ్లు టార్గెట్
-
వేలిముద్రాలను సేరించిన క్లూస్ టీం
కోహెడ : మండల కేంద్రానికి చెందిన కొండ ప్రసన్న, పేర్యాల ముత్యరావు, సూరు చిన్న మల్లవ్వ ఇళ్లలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ముత్యంరావు సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి భార్యతో కరీంనగర్‌లో ఉంటున్న కొడుకుల వద్దకు వేళ్లాడు. కొండ ప్రసన్న తన రెండంతస్తుల భవనంలోని పైఅంతస్తులో కుటుంబ సభ్యులతో పడుకున్నాడు. మల్లవ్వ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లింది. దొంగలు తాళం వేసిఉన్న ఇళ్లను టార్గెట్ చేశారు. తాళాలు పగులగొట్టి ఇళ్లను గుల్ల చేశారు. పేర్యాల ముత్యంరావు ఇంట్లో బీరువా పగులగొట్టి అందులో ఉన్న రూ.50 వేలు, ఐదున్నర తులాలు బంగారు అభరణాలు, కొండ ప్రసన్న ఇంట్లోని బీరువాను పగులగొట్టి రూ.40 వేలు, 2 తులాలు బంగారు అభరణాలు, సూరు చిన్నమల్లవ్వ ఇంట్లో రూ.15 వేలు అపహరించుకుపోయారు. అలాగే తాళం వేసి ఉన్న పేర్యాల చొక్కారావు(పాత ఇంట్లో) సైతం దొంగలు చొరబడ్డారు. ఇంట్లో విలువైన వస్తువులు లేకపోవడంతో వెనుదిరిగారు. గ్రామానికి చెందిన ఇద్దరి ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లారు. ఒకటి కోహెడ క్రాసింగ్ వద్ద, మరొకటి కోహెడ హైస్కూల్ వద్ద వదిలేసి పారిపోయారు. చోరీ జరిగిన ఇళ్లను హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య, కోహెడ ఎస్సై చందా తిరుపతి సందర్శించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.