- రూ.82వేలు, ల్యాప్‌టాప్ అపహరణ
ముల్కనూరు డెయిరీలో చోరీ
Published Fri, Sep 9 2016 10:44 PM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM
భీమదేవరపల్లి: ముల్కనూరు మహిళా స్వకృషి డెయిరీలో శుక్రవారం వేకువజామున చోరీ జరిగింది. సుమారు రూ.82 వేలతోపాటు ల్యాప్‌టాప్ అపహరణకు గురైంది. డెయిరీ వెనుక కిటికీ జాలి తొలగించిన దుందడుగు.. ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారు. తొలుత సీసీ కెమెరా వైర్లు కట్ చేసి క్యాష్‌రూంలోకి వెళ్లారు. అందులోని రూ.82వేలు తీసుకుని కబ్‌బోర్డులు, టేబుల్ డ్రాలో వెతికారు. అందులో ఏమీలేకపోవడంతో చేతిరుమాలు అడ్డుపెట్టుకుని జీఎం గది తెరవడం సీసీ కెమెరాలో నమోదైంది. లోనికి వెళ్లగానే సీసీ కెమెరా సిస్టమ్ ఆఫ్ చేశారు. ల్యాప్‌టాప్ వెంట తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య, ముల్కనూర్, హుస్నాబాద్ ఎస్సైలు సంఘటనా చేరుకున్నారు. క్లూస్‌టీంతో వేలిముద్రలు సేకరించారు. ఇద్దరు చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్యాంక్ జీఎం భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ముల్కనూర్ ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు.
Advertisement