తెరిచి ఉన్న బీరువా
5 సవర్ల బంగారం, రూ.8 వేల నగదు అపహరణ
బాపట్ల టౌన్ : పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో పట్టపగలే చోరీ జరిగింది. అదే ప్రాంతానికి చెందిన బొమ్మిడి శ్రీనివాసరావు దంపతులు బ్యాంకులో ఉన్న అప్పును తీర్చేందుకు వెళ్ళారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఇంట్లోని తాళం తీసి బీరువాలో ఉన్న 5 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.8 వేల నగదును అపహరించుకుపోయారు. శ్రీనివాసరావు దంపతులు తిరిగి వచ్చి చూసేసరికి బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాను పరిశీలించిగా చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ ఎ. వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.