నగరంలో జూనియర్ కళాశాల ఆవరణంలో గురువారం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో పేరుమోసిన జేబుదొంగను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
- పవన్ సభలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సీనియర్ జేబుదొంగ
అనంతపురం సెంట్రల్ : నగరంలో జూనియర్ కళాశాల ఆవరణంలో గురువారం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో పేరుమోసిన జేబుదొంగను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కానీ ఆ వివరాలు వెల్లడించలేదు. సభలో యువకులంతా ఉత్సాహంలో మునిగిపోయి ఉండగా, సందట్లో సడేమియాలా ఈ సీనియర్ జేబుదొంగ తన పని కానిస్తూ వచ్చాడు. ఇది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో బందోబస్తులో ఉన్న పోలీసులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే మూడు విలువైన సెల్‌ఫోన్లు, కొంత నగదు, పర్సులు కొట్టేసినట్లు సమాచారం. అయితే పోలీసులు నిందితుని సమాచారం గానీ, స్వాధీనం చేసుకున్న వాటి వివరాలను కానీ అధికారికంగా వెల్లడించలేదు.