దొంగ అరెస్ట్
పెద్దమండ్యం: చుట్టం చూపుగా వచ్చి రూ.50 వేల నగదు, 19 తులాల బంగారం చోరీ చేసిన దొంగను పోలీసులు పది రోజుల్లోనే పట్టుకున్నారు. ములకలచెరువు సీఐ రుషీకేశవ సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దమండ్యం మండలంలోని వెలిగల్లుకు చెందిన నాగూరు హుసేన్‌బీ గొర్?రలు మేపుకొని జీవనం సాగిస్తోంది. ఈమె కుమారునికి మండలంలోని పాపేపల్లెకు చెందిన దస్తగిరి కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో దస్తగిరి కుమారుడు సాధిక్‌పీరా (23) వెలిగల్లులో ఉన్న అక్క దగ్గరికి ఆటోలో వెళ్లాడు. ఇంట్లో ఉన్న 19 తులాలు బంగారం, రూ.50 వేలు నగదు చోరీ చేశాడు.
తాను దాచి ఉంచిన బంగారం, నగదు చోరీ అరుునట్లు పది రోజుల క్రితం హుసేన్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రుషీకేశవ, ఎస్‌ఐ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇంటికి వేసి న తాళం అలాగే ఉండి నగలు, నగదు చోరీకి గురికావడంతో బంధువులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బంధువైన సాధిక్‌పీరాను విచారించడంతో దొంగతనం బయటపడింది. అతన్ని పాపేపల్లె బస్‌స్టాప్ వద్ద అరెస్ట్ చేసి 19 తులాల బంగారం, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపా రు. నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పది రోజుల్లోనే చోరీని ఛేదించిన ఎస్‌ఐ శంకరమల్లయ్య, క్రైం పార్టీ సిబ్బందిని సీఐ అభినందించారు. వారికి రివార్డుల కోసం జిల్లా ఎస్పీకి నివేదిస్తామని పేర్కొన్నారు.