కొత్తగా ఆలోచిస్తేనే ఆదరణ
కొత్తగా ఆలోచిస్తేనే ఆదరణ
Published Sat, Aug 20 2016 11:23 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM
అచ్యుతాపురం : సృజనాత్మకతతో కొత్తదనాన్ని ప్రదర్శిస్తే సినీ పరిశ్రమ ఎప్పటికీ ఆదరిస్తుందని ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. శనివారం ఆయన ప్రశాంతి పాలిటెక్నిక్‌కళాశాల ఫ్రెషర్స్ డేకి వచ్చారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినీపరిశ్రమలో 24రంగాలున్నాయన్నారు. సినీపరిశ్రమవైపు ఆసక్తి ఉన్నవారు ఏదో ఒక రంగాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. క్రియేటివ్‌గా ఆలోచించేవాడిదే పరిశ్రమ అన్నారు. కాలంతోపాటు రచనలు, దర్శకత్వం, నటన, ఎడిటింగ్‌ల్లో మార్పులు వచ్చాయన్నారు.తేలికైన పదాలతో నిగూఢమైన అర్థాన్ని చెప్పడం, తక్కువ సన్నివేషాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేయడం కొత్తదనాన్ని చూపడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అన్నారు.
తన 23 ఏళ్ల సినీ పస్థానంలో 2300 పాటలు రాశానని చెప్పారు. నమస్తే అన్నా సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని, ఠాగూర్‌సినిమాలో ‘నేను సైతం’ జాతీయ ఉత్తమ పాటల రచయితగా పురస్కారం లభించిందన్నారు. త్వరలో రామ్‌చరణ్ ధ్రువ, శేఖరకమ్ముల దర్శకత్వంలో రానున్న సినిమాలకు పాటలు రాశానన్నారు. తెలుగుపై మక్కువ, పాటపై ఇష్టం ఉన్న ప్రతి వ్యక్తి రచయితగా రాణించవచ్చని తెలిపారు. పరిశ్రమలో అనేక కష్టాలు ఉన్నమాట వాస్తవమని, ఏ రంగంలోనైనా మన అవసరం ఉంటే అవకాశాలకు కొదవ ఉండదన్నారు. ఏదో రంగంలో టాలెంట్ ఉండాలన్నారు. సి.నారాయణరెడ్డి స్ఫూర్తితో గేయరచయితగా ఎదిగానని తెలిపారు.
స్వచ్ఛభారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా..
రాష్ట్రంలో స్వచ్ఛభారత్‌కు బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నానని అశోక్‌తేజ చెప్పారు. స్వచ్ఛభారత్‌కు అవసరమైన గేయాలను రచించడం, అవగాహన సదస్సుల్లో గళం విప్పి స్ఫూర్తిని కలిగిస్తున్నామని చెప్పారు. తన అమ్మనాన్నల పేరుతో ఏర్పాటుచేసిన ట్రస్ట్ ద్వారా సేవాకార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు.
Advertisement
Advertisement