
బ్యాంకులకు మూడు రోజుల పాటు సెలవులు
హైదరాబాద్: ఇప్పటికే బ్యాంకులు తెరిచి ఉన్నా నగదు లభించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న ఖాతాదారుల కష్టాలు మరింత పెరుగనున్నాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తుండడంతో వారు లబోదిబోమంటు న్నారు. ఈ నెల 10న రెండో శనివారం, 11న ఆదివారం, 12న మిలాదున్-నబీ పండుగ ఉండడంతో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి.