వరంగల్: రైలు కింద పడి ముగ్గురు వ్యుక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.. ఈ ఘటన వరంగల్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా రైల్వే పోలీసులు బావిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు ప్రయత్నించగా ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. రైల్వే పోలీసులు మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.