ఆటో బోల్తా... ముగ్గురికి గాయాలు | Three injuries in auto roll over | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా... ముగ్గురికి గాయాలు

Published Fri, Sep 23 2016 11:48 PM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM

Three injuries in auto roll over

ప్రొద్దుటూరు క్రైం: స్థానిక జమ్మలమడుగు రోడ్డులో శుక్రవారం ఆటో బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చౌడూరుకు చెందిన మమత, రామాంజనేయులు, కాకిరేనిపల్లె ఖాసిం జమ్మలమడుగు వైపు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఆటోను ఎక్కారు. ఆ వాహనం దొరసానిపల్లె సమీపంలోకి రాగానే డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మమత, రామాంజనేయులు, ఖాసిం గాయాల పాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మమతను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement