మహిళల తిరంగ్ బైక్ ర్యాలీ
మచిలీపట్నం (కోనేరుసెంటర్) :
స్వాతంత్య్ర దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బుధవారం మచిలీపట్నంలో మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తిరంగ్ బైక్ ర్యాలీ ద్వారా ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపాలనే ప్రధాని నిర్ణయం హర్షణీయమన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శరబాల మాలతి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కరెడ్ల సుశీల తదితరులు మాట్లాడారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు యలమంచిలి అరుణ, ఉపాధ్యక్షురాలు వసుంధరాదేవీ, ప్రధాన కార్యదర్శి పోలే శాంతి తదితరులు పాల్గొన్నారు.