శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
Published Fri, May 5 2017 12:29 AM | Last Updated on Sat, Aug 25 2018 5:22 PM
ద్వారకాతిరుమల : వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు చిన వెంకన్న క్షేత్రం ముస్తాబైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈనెల 12 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లు వేశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా ముస్తాబు చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉత్సవాల రోజుల్లో స్వామి రోజుకో అలంకరణలో దర్శనమిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సంగీత కచేరీ, సాయంత్రం 5 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన, రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ, రాత్రి 8 గంటలకు రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు ఈఓ వెల్లడించారు.
Advertisement
Advertisement