utsavalu
-
సేనాపతి ఉత్సవం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణ కార్యక్రమంలో శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి ఉత్సవాలు.. 12వ తేదీ రాత్రి ధ్వజావరోహణంతో ముగుస్తాయి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీన్నే ‘మృత్సంగ్రహణ యాత్ర’ (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 05వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 06వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 07వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, ఎనిమిదో తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతారు. గరుడ సేవకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.09వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 12వ తేదీ శనివారం ఉదయం చక్రవాహనం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అక్టోబరు 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. అలాగే.. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. -
దుర్గగుడిలో శాకంభరి ఉత్సవాల రెండవ రోజు (ఫొటోలు)
-
సందేశాత్మకం నవరాత్రి అలంకరణం
త్రేతాయుగం, ద్వాపరయుగం...ఇలా ఏ కాలంలోనైనా, ఏ అంశంలోనైనా స్త్రీని అత్యున్నత స్థానంలో ఉంచి గౌరవించారు. ఆమెను తొలిగురువుగా, ఆది శక్తిగా భావించి ఆరాధించారు. మన పురాణాలను కూలంకషంగా పరిశీలించినట్లైతే ఈ విషయం మనకు అవగతమౌతుంది. భారతావని అంతటా వైభవోపేతంగా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల్లోనూ అమ్మవారిదే వైభోగమంతా. ఆ జగన్మాతని ఆరాధించేందుకే ఈ మహా శరన్నవరాత్రి సంరంభమంతా... విజయదశమి....పదిరోజుల పండుగ...మనిషిలో దాగిన లోభం, అలసత్వం, జడత్వం, దురాశ, పాప–చింతనలాంటి వికారాలను నశింపచేసి, సాత్వికప్రవృత్తి వైపు నడిపిస్తుంది. మనలోని శక్తిని జాగృతం చేసి శుభసంకల్పాలకు నాంది పలికి చైతన్యం వైపుగా నడిపిస్తుంది. విజయదశమి–నవరాత్రి–దుర్గాపూజ...అన్ని శబ్దాలకూ ఒకటే అర్థం....తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలుగా భావిస్తూ ఆ జగన్మాతని పూజించుకోవటం. అసలు దసరా పండుగను తొమ్మిది రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు, అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఎందుకు కొలుస్తారు, దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి తెలుసుకుందాం. త్రిపురసుందరి, త్రిపురేశ్వరి, పరమేశ్వరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి వంటి అనేక నామాలతో పూజలందుకుంటున్న లలితాదేవి అఖిలాండకోటి బ్రహ్మాండాలకు జనని. పిపీలికాది బ్రహ్మపర్యంతమూ సకల జీవకోటికీ మాతృదేవత. తన బిడ్డలుగా భావించిన ప్రజలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులను సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దసరా ఉత్సవాలు. దశహరా అంటే పది రకాల పాపాలను నశింపజేసేవని అర్థం. అదే క్రమేణా దసరాగా మారింది. విజయదశమి – వివిధ కారణాలు ఆయా రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దుర్గాదేవి మహిషారుని సంహరించిన రోజని, అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది. ఐకమత్యమే ఆయుధ బలం ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అందుకే ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామినుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, వీటన్నింటినీ కూడగట్టుకోవడానికి కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధంచేసి విజయం సాధించింది. సమష్టి బలం దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఏ ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా ఉండి, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించగలం. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ చాటి చెబుతోందన్నమాట. అందరి మొరలూ ఆలకించే అసలైన అమ్మ మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు అమ్మ భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఐహిక, ఆముష్మిక ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి. ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి. శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్షం కనక ధారలు కురిపిస్తుందనే విశ్వాసం, శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు అన్నీ విజయ సోపానాలకు దారితీస్తాయనే నమ్మకం అనాదిగా ఉంది. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. మహిషాసురమర్దిని: సర్వదేవతల తేజస్సుల కలయిక అయిన ఆదిశక్తి మహిషాసుర మర్దిని. ఆశ్వయుజ శుద్ధ నవమిరోజున మహిషాసురుడిని సంహరించింది కనుక మహర్నవమినాడు అమ్మకు ఆ అలంకరణ చేస్తారు. సింహవాహన అయిన మహిషాసురమర్దిని నేటి పర్వదినాన ఉగ్రరూపంలోగాక శాంతమూర్తిగా దర్శనమివ్వడం విశేషం. మహిషాసురమర్దిని అలంకార ంలో అమ్మను దర్శించుకోవడం వల్ల సకల శుభాలూ చేకూరడమేగాక పిశాచబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరాజరాజేశ్వరి: లోకశుభంకరి, అపరాజితాదేవి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి దసరా ఉత్సవాల ముగింపు రోజయిన విజయదశమినాడు భక్తులకు చెరకుగడతో, అభయముద్రతో, ఆర్తితో పిలవగానే వచ్చే పాపగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ అవతారాన్ని దర్శించడం వల్ల సర్వకార్యానుకూలత, దిగ్విజయ ప్రాప్తి కలుగుతాయి. దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. దీనికే రామలీల అని పేరు. తెలంగాణ ప్రాంతం నవరాత్రులలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యమిస్తే, విజయనగరంలో పైడితల్లి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రాంతంలోని పల్లెలలో ‘శమీశమయితే పాపం శమీ శత్రువినాశనం, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’ అంటూ శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మి ఆకును తీసుకు వచ్చి, జమ్మి బంగారాన్ని అందరికీ పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పెద్దలకు జమ్మిని ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం ఒక వేడుకగా జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలలోనూ, కర్మాగారాలలోనూ యంత్రాలను పూజిస్తారు. బాక్స్ దుర్గానవరాత్రులో ఆఖరి అవతారం శ్రీరాజరాజేశ్వరి. భక్తులకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఙ్ఞానశక్తిని ప్రసాదించే అవతారం శ్రీరాజరాజేశ్వరి. ఏ దేవి రూపమైనా, ఏ శక్తి రూపమైనా అన్నిటికి మూలమైన శక్తి పరమేశ్వరి. ఈరోజు లలితా సహస్రనామ పారాయణతో పూజించాలి. చేమంతులతో ఆరాధన చేయాలి. భక్ష్య, భోజ్యాలతో మహానివేదన చేయాలి. ఈ రోజున అశ్వపూజ, ఆయుధపూజ, ఉఛ్చైశ్రవ పూజ, వాహన పూజ నిర్వహిస్తారు. శ్రీరాముడు విజయదశమి రోజున ‘అపరాజితాదేవిని’ పూజించి రావణునిపై విజయాన్ని సాధించాడు. నవరాత్రుల అనంతరం దశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని స్మరిస్తారు. ‘‘శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శినీ’’ ఈ మంత్రంతో తమ తమ గోత్రనామాలు చెప్పుకుని జమ్మి వృక్షాన్ని పూజ చేసి మూడు ప్రదక్షిణలు చేస్తారు. శ్రీరాముడు దశకంఠుని సంహరించిన రోజు గనుక ‘దశహర’ అని కూడా పిలువబడుతోంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా దశమి రోజునే. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. దేవీ ఉపాసకులు అంతవరకు తాము చేసిన జప సంఖ్యననుసరించి హోమాలు చేస్తారు. నవరాత్రి వ్రత సమాప్తి గావించిన వారు సర్వ సిద్ధులు పొందుతారు, సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు –మానవులు తప్ప. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులున్నారు. వారే అందరిలోనూ ఉండే అరిషడ్వర్గాలనే శత్రువులు. వారితోనే మనం పోరాడి విజయం సాధించాలి. జీవితాలను ఆనందమయం చేసుకోవాలి. విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, మంచి పని అయినా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం. ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం. –డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: సింహం వద్ద సలహదారు ఉద్యోగం! ) -
మంత్రాలయంలో వారం రోజుల పాటు ఆరాధన మహోత్సవాలు
మంత్రాలయం: భక్తకోటి కల్పతరువు శ్రీరాఘవేంద్రస్వామి. సశరీరంగా చింతామణి సదృశ్యులైన స్వామి వారి 352వ ఆరాధన సప్త రాత్రోత్సవ మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వారం రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఆరాధనోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. శ్రీరాఘవేంద్ర స్వామి ప్రశస్థి అవార్డులు అందుకోవడానికి ప్రముఖులు మంత్రాలయం రానున్నారు. ఏపీ రాష్ట్ర గవర్నర్ నజీర్.. పూర్వారాధన వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఉత్సవాల నేపథ్యంలో వేదభూమి మంత్రాలయం విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతోంది. పూర్తయిన ఏర్పాట్లు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి శ్రీమఠం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల వసతి కోసం హెచ్ఆర్బీ, భూ, దుర్గారమణ, నరహరి, పద్మనాభ డార్మెటరీలు, పాత పరిమళ విద్యానికేతన్ పాఠశాలలను కేటాయించారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు 50 మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. నదిలో నీటి కొరత దృష్టా పుణ్య స్నానాలకు వంద షవర్లు ఏర్పాటు చేశారు. మఠం సీఆర్ఓ, ప్రధాన ముఖధ్వారం, మఠం ప్రాకారం, అన్నపూర్ణ భోజనశాల దారిలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆరు లక్షల పరిమళ ప్రసాదాలు తయారు చేశారు. మహా రథోత్సవం సందర్భంగా హెలికాప్టర్ నుంచి పూలవాన కురిపించనున్నారు. అవార్డుల ప్రదానం ఆనవాయితీలో భాగంగా శ్రీరాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. పూర్వారాధన రోజున ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రాలయం రానున్నట్లు సమాచారం. విద్వాన్ రామవిఠలాచార్య, శతావధాని గరికపాటి నరసింహారావు, టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, ఎంఐటీ శాంతి యూనివర్సిటీ వ్యవస్థాపకులు డా.విశ్వనాథ్‌కు రాయరు అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. వేడుకల నిర్వహణ ఇలా.. ● మంగళవారం రాయరు ఉత్సవాలు ప్రారంభోత్సవంలో భాగంగా ధ్వజారోహణ, ధాన్యపూజ, రజిత మంటపోత్సవం, గో, గజ, తురగ పూజలు చేస్తారు. ● బుధవారం శాఖోత్సవం, రజత మంటపోత్సవం ఉంటుంది. ● గురువారం పూర్వారాధన సందర్భంగా రజత సింహ వాహనోత్సవం నిర్వహిస్తారు. ● శుక్రవారం మధ్యారాధన సందర్భంగా రాఘవేంద్రుల బృందావనానికి మహా పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్ర సమర్పణ ఉంటుంది. గజ, రజత, స్వర్ణ రథోత్సవాలు ఉంటాయి. ● శనివారం ఉత్తరారాధన సందర్భంగా మహా రథోత్సవం, వసంతోత్సవం జరుపుతారు. ● ఆదివారం శ్రీ సుజ్ఞానేంద్ర తీర్థుల ఆరాధన, అశ్వ వాహనోత్సవం ఉంటుంది. ● సోమవారం సర్వ సమర్పణోత్సవంలో భాగంగా బంగారు పల్లకీ, చెక్క, వెండి, బంగారు రథోత్సవాలు ఉంటాయి. -
ఘనంగా ఆషాడమాసం ఉత్సవాలు ప్రారంభం
-
ఇంద్రకీలాద్రి: భక్తుల కోలాహలం.. దుర్గమ్మకు ఆషాఢం సారె
-
మార్చి 5నుంచి శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్చి నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా మార్చి నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 5 నుంచి 9వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మార్చి 5న శ్రీ కులశేఖర ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం మార్చి 9న కుమారధార తీర్థ ముక్కోటి మార్చి 10న లక్ష్మీ జయంతి మార్చి 21న శ్రీ అన్నమాచార్య వర్ధంతి మార్చి 25న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం -
శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో డిసెంబర్ మాసంలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ నెలలో ధనుర్మాసం ప్రారంభకానున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు టీటీడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ఉత్సవాల వివరాల్లోకెళితే.. డిసెంబర్ 9: చక్రతీర్థ ముక్కోటి. డిసెంబర్ 10: తిరుమంగై యాళ్వార్ శాత్తుమొర. డిసెంబర్ 11: కార్తీక పర్వ దిపోత్సవం, శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, శ్రీదత్త జయంతి. డిసెంబర్17: ధనుర్మాసం ప్రారంభం. డిసెంబర్ 25: శ్రీ తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. డిసెంబరు 26: అధ్యయనోత్సవాలు ప్రారంభం, సూర్య గ్రహణం. -
రామదాసు కీర్తనలతో ఓలలాడిన భద్రాద్రి
సాక్షి, భద్రాచలం: భక్త రామదాసు 385వ జయంత్యుత్సవాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, శ్రీచక్ర సిమెంట్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత భక్త రామదాసు చిత్రపటంతో భక్తుల కోలాటాల నడుమ నగర సంకీర్తనతో ఆలయం నుంచి గోదావరి నది వరకూ వెళ్లారు. అక్కడ గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. ఆలయం తరపున గోదారమ్మకు పసుపు, కుంకుమ, వస్త్రాలను అందజేసి హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని భక్త రామదాసు విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం చేసి గర్భగుడిలోని స్వామి వారి మూలమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకున్నారు. చిత్రకూట మండపంలో సంగీత విద్వాంసులంతా ఒకేసారి రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠి గానం చేశారు. ఒక్కో కీర్తన మధ్యలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి వివిధ ఫలాలు, పుష్పాలతో అర్చకులు పూజలు నిర్వహిస్తూ మంగళ హారుతులు ఇచ్చారు. కళాకారులను కృష్ణ మోహన్ ఘనంగా సత్కరించారు. కచేరీలు ఈ నెల 25 వరకూ కొనసాగుతాయి. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
ముగిసిన కామాక్షీ పీఠం స్వర్ణోత్సవాలు అమలాపురం టౌ¯ŒS : వారం రోజులుగా సాగుతున్న అమలాపురం కామాక్షీ పీఠం మహా సంస్థానం స్వర్ణోత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. ఉదయం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది. నవగ్రహ దేవతలకు జపాలు, తర్పణాలు, హవనం జరిగాయి. పీఠానికి పంచలోహ విగ్రహాలు అందజేసిన పి.కమల కల్యాణం జరిపించారు. కోళపర్తి శివరామారావు, సత్యశ్రీ దంపతుల చేతుల మీదుగా కల్యాణం జరిగింది. పంచాయతన హోమ ప్రధాన గుండంలో పీఠాధిపతి, 2వ గుండంలో శివరావు దంపతులు, 3వ గుండంలో మాచిరాజు రామకృష్ణారావు దంపతులు, 4వ గుండంలో నిమిషకవి తారకరామ శంకర్ దంపతులు, 5వ గుండంలో అడుగుమిల్లి సత్యనారారాయణమూర్తి దంపతులు మహా పూర్ణాహుతి గావించారు. యాజ్ఞికులను పీఠాధిపతి సత్కరించారు. చివరగా చతుర్వేద స్వస్తి, అవబృధ స్నానం, మహదాశీర్వచనాలు జరిగాయి. ద్రాక్షాయణి కామాక్షీ అమ్మవారి పాటలు వీనుల విందుగా పాడారు. అమ్మ వక్కలంక వాణి, అన్నయ్య మర్రి దుర్గారావుల ఆధ్వర్యంలో ప్రేమ మందిరం పిల్లలు తమ వంతు సేవలందించి పీఠాధిపతి ప్రశంసలు అందుకున్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల : వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు చిన వెంకన్న క్షేత్రం ముస్తాబైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈనెల 12 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లు వేశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా ముస్తాబు చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉత్సవాల రోజుల్లో స్వామి రోజుకో అలంకరణలో దర్శనమిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సంగీత కచేరీ, సాయంత్రం 5 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన, రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ, రాత్రి 8 గంటలకు రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు ఈఓ వెల్లడించారు. -
విజయనగరం ఉత్సవాలలో పుష్ప ప్రదర్శన
-
3 నుంచి మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు
పందిరిరాట ముహూర్తంతో ఏర్పాట్లకు శ్రీకారం తిరుమల తరహాలో 10 రోజుల వైభవంగా నిర్వహణ యానాం టౌన్ : ‘మీసాల వెంకన్న, చల్దికూడు వెంకన్న, యానాం వెంకన్న’గా ప్రసిద్ధి చెందిన యానాం భూసమేత వెంకటేశ్వరస్వామి వారి 14వ బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 3 నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం స్థానిక ఆలయ ప్రాంగణంలో పందిరిరాట ముహూర్తాన్ని వేదపండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. యానాం వెంకటేశ్వర దేవస్థాన ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బ్రహ్మోత్సవాలను 10 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. పందిరిరాట ముహూర్తం సందర్భంగా ఆలయంలో అర్చకులు పెద్దింటి లక్ష్మణాచార్యులు, నరసింహాచార్యులు, పెద్దింటి రఘురామవినోద్ తదితరులు మంగళవాయిద్యాల మధ్య వేదమంత్రాలతో విశేష పూజలను నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్, ప్రతినిధులు కాదా వెంకటేశ్వరరావు, ఆకుల నాగేశ్వరరావు, గంధం శంకరరావు, కె.గాంధీ, ఎక్స్ప్రెషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మద్దింశెట్టి జియన్న దంపతులు పూజలు చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను కమిటీ ఆ««దl్వర్యంలో చేపట్టనున్నట్టు ఉమాశంకర్ తెలిపారు. రోజూ వాహనోత్సవాలు, ఆలయంలో వేదపండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో పూజలను నిర్వహిస్తామన్నారు. -
బ్రహ్మోత్సవ వేడుకకు వేళాయె...
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 12 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సిద్ధం చేసిన స్వామి వారి ఆహ్వాన పత్రిక, పోస్టర్లను ఆదివారం స్వామి వారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు భక్తులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణమూర్తి మాట్లాడుతూ భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్న వేంకటేశ్వరస్వామి కొలువైన వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు. వాడపల్లి ముస్తాబు.. ఐదురోజుల పాటు జరిగే వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వాడపల్లి ముస్తాబవుతోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో అష్టదళ పాదపద్మారాధన, ఐశ్వర్యలక్ష్మి హోమం, సహస్ర దీపాలంకరణసేవ, అషో్టత్తర కలశాభిషేకం తదితర అర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఈఓ వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే అషో్టత్తర పూజలు, కల్యాణాలు, ఉప నయనాలు, వివాహలు రద్దు చేశామన్నారు. బ్రహ్మోత్సోవ ఆర్జిత సేవలకు రూ.1116 చెల్లించే భక్తులు నగదు, డీడీలు, మనియార్డర్లు ఈఓ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, వాడపల్లి, ఆత్రేయపురం మండలం, ఫోన్: 08855–271888కు పంపి, రసీదు పొందాలన్నారు. -
మరియ ఆశీస్సులతోనే సెయింట్ హోదా
కడప కల్చరల్: విశ్వమాత మదర్‌థెరిసా కరుణామయి మరియమాత ఆశీస్సులు పొందడంతోనే నేడు సెయింట్ హోదా పొందగలిగారని అమగంపల్లె విచారణ గురువులు ఫాదర్ ఎల్ పీటర్ ప్రభాకర్ పేర్కొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని కడప వేలాంగణి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో నవదిన ఉత్సవాలలో భాగంగా ఏడో రోజు నిర్వహించిన సభలో ఆయన వక్తగా పాల్గొన్నారు. మదర్‌థెరిసా మరియమాతను ఎక్కువగా ప్రార్థించేదని, అందుకే ఆమె పునీతురాలై ప్రపంచంలోని గొప్ప హోదా అందుకున్నారన్నారు. నేడు మన జీవితాలకు దైవం ఆశీస్సులే కారణమని, కృతజ్ఞతగా మనం నిత్యం ఆ దైవానికి స్తుతులు చెల్లించవలసి ఉందన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యమాత స్వరూపాన్ని అలంకరించిన తేరుపై ఉంచి మెర్సిడేరియస్ ఫాదర్లు, సిస్టర్లు, యూత్ ఆధ్వర్యంలో పాత గుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. సెయింట్ మెరీస్ క్యాథడ్రల్ చర్చి విచారణ గురువులు ఫాదర్ సగిలి ప్రకాశ్ దివ్య బలిపూజ నిర్వహించి ప్రారంభోపన్యాసం చేశారు. ఆరోగ్యమాత చర్చి డైరెక్టర్ ఫాదర్ కన్నా జయన్న వారిని శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సహాయ గురువులు, ఫాదర్లు కె.లూర్దురాజు, డి.సుమన్, ఉపదేశి ప్రసాద్, ఆరోగ్యమాత సభ సిస్టర్లు, తిరునాల కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.