- సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి
- నేర సమీక్ష సమావేశంలో డీఐజీ రవివర్మ
బాధితులకు బాసటగా నిలవాలి
Published Thu, Sep 22 2016 12:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
వరంగల్ : న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసు అధికారు లు, సిబ్బంది బాసటగా నిలవాలని వరంగల్ రేంజ్ డీఐజీ రవివర్మ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝూ ఆధ్వ ర్యంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేష న్ కు వచ్చేవారితో స్నేహపూరితంగా వ్య వహరించి సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. పేదల జీవి తాలతో చెలగాటమాడుతున్న గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని అన్నారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్ ఓపె న్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఉద్యోగులను తాత్కాలికంగానే వివిధ జిల్లాలకు కేటాయించనున్నుట్ల వివరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు శాశ్వతంగా ప్రతి పోలీసును ఆయా జిల్లాల్లో నియమిస్తామన్నారు. రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ మాట్లాడుతూ పోలీసు అధికారులు పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలన్నారు.
అనంతరం పోలీసు స్టేషన్ల వారిగా నమోదైన, దర్యాప్తు జరుగుతున్న కేసులు, జరుగుతున్న ఆలస్యానికి కారణాలపై ఆరా తీశారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్‌కంపాటీ, డీటీసీ, మహబూబాబాద్, జనగామ, పరకాల, నర్పంపేట డీఎస్పీలు సత్యనారాయణరెడ్డి, రాజమహేంద్రనాయక్, పద్మనాభరెడ్డి, సుధీంద్ర, మురళీధర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ బాలరాజు, రూరల్‌లోని సీఐలు పాల్గొన్నారు.
ఆఖరు సమీక్ష సమావేశమేనా...!
జిల్లాల పునర్విభజనతో బుధవారం రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఉమ్మ డి వరంగల్ జిల్లా నేర సమీక్ష సమావేశం అఖరు అని పోలీసు అధికారులు భావిస్తున్నారు. జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడుతున్నందున నలుగురు ఎస్పీలు ఉండనున్నారు. దీంతో భవిష్యత్‌లో జరరగనున్న నేర సమీక్ష సమావేశాలు కొత్త ఎస్పీల ఆధ్వర్యంలో జరుగనున్నాయి. జిల్లాల విభజనతో ఎవరు ఏ జిల్లాకు పోతారో తెలియని పరిస్థితి, మళ్లీ అందరు కలసి సమీక్ష సమావేశంలో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల పోలీసు అధికారులంతా ఉన్నతాధికారులతో గ్రూప్ ఫొటో తీసుకున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement