నల్లగొండ : నల్గొండలోని మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో బుధవారం జరగాల్సిన అన్నీ పరీక్షలు రద్దు చేస్తూ.. యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్త సమ్మె కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. యూనివర్సిటీ పరిధిలో ఎంఏ, ఎంకాం, ఎంబీఏ సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండగా.. బీఈడీ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. రద్దు అయిన పరీక్షలు
ఏ రోజు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ రోజు జరగాల్సిన పరీక్షలు రద్దు
Published Wed, Sep 2 2015 11:19 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement
Advertisement