అనంతపురం అగ్రికల్చర్ : చీనీ, నిమ్మ తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం, మార్కెటింగ్ అంశాలపై మంగళవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యాన శాస్త్రవేత్తలు బి.శ్రీనివాసులు, కేసీ నటరాజ్ హాజరై అవగాహన కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు చీనీ, నిమ్మ రైతులు 08554–270430, 81420 28268 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.