'కాంగ్రెస్ కు పేరు వస్తుందనే పెండింగులో పెట్టారు' | tpcc chief utham kumar reddy statement on indiramma houses pending | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ కు పేరు వస్తుందనే పెండింగులో పెట్టారు'

Published Mon, Aug 3 2015 4:44 PM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

'కాంగ్రెస్ కు పేరు వస్తుందనే పెండింగులో పెట్టారు'

'కాంగ్రెస్ కు పేరు వస్తుందనే పెండింగులో పెట్టారు'

ఇందిరమ్మ ఇళ్లు పూర్తయితే కాంగ్రెస్కు పేరొస్తుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం పెండింగులో పెట్టిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు పూర్తయితే కాంగ్రెస్కు పేరొస్తుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం పెండింగులో పెట్టిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డ లబ్ధిదారులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేయని లబ్ధిదారుల బిల్లులను నిలిపివేయడం బాధాకరమన్నారు.

రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిల్లులు రాక  అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ధర్నా చేపట్టనుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement