మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి సన్నాహాలు
సూళ్లూరుపేట: పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్‌ను షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ మార్కెట్ దుస్థితిని మున్సిపల్ అధికారులు గతంలో షార్ అధికారుల దష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నూతన నిర్మాణానికి సహకారం అందించేందుకు వారు అంగీకరించారు. రూ.2 కోట్లు అంచనాలతో 44 గదులను నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో కంట్రోలర్ రాజారెడ్డి మార్కెట్‌ను పరిశీలించారు. వెంటనే గదులను ఖాళీ చేసి అప్పగిస్తే సుందరంగా తీర్చిదిద్ది ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. మొదట షార్ కంట్రోలర్‌కు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్.విజయలక్ష్మి, కమిషనర్ పాయసం వెంకటేశ్వర్లు ఘనస్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో డీఈ చంద్రయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.