గిరిజన విద్యార్థిని మృతి
Published Tue, Jul 26 2016 11:10 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
సీతంపేట : స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సవర శిరీషా(11) అనే గిరిజన విద్యార్థిని మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ స్వగ్రామమైన బుడ్డడుగూడలో మృతి చెందింది. మృతిరాలి తల్లి, తమ్ముడుకు బాగోలేదని తండ్రి సురేష్ పాఠశాలకు వచ్చి ఈ నెల 19న విద్యార్థిని ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ విద్యార్థినికి ఒంట్లో బాగోలేదని, పచ్చకామెర్లు వచ్చాయని చెప్పి నాటు మందులు వాడడంతో విద్యార్థిని మృతి చెందినట్టు హెచ్‌ఎం కె.సుబ్బారావు, మేట్రిన్ పి.అమల తెలిపారు. బాలిక మృతి విషయమై ఐటీడీఏకు సమాచారమిచ్చారు. వెంటనే ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎంపీవీ నాయిక్, హెచ్‌ఎం,మేట్రిన్‌లు గ్రామానికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.5 వేలు అందజేశారు.
Advertisement
Advertisement