గొంతు కోసుకున్న 'ఆశ్రమ' విద్యార్థిని..! | hostel student teja committed suicide attempt | Sakshi
Sakshi News home page

గొంతు కోసుకున్న 'ఆశ్రమ' విద్యార్థిని..!

Published Mon, Feb 1 2016 10:06 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

hostel student teja committed suicide attempt

మందస(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా బుడబంబో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని యలమంచలి తేజ (14) సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం సోంపేట మండలం కర్తలపాలెం గ్రామానికి చెందిన తేజ అనే బాలిక ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

సోమవారం సాయంత్రం హాస్టల్‌లోని తన గదిలో తేజ బ్లేడ్‌తో గొంతు, చేతిపై గాయాలు చేసుకుంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న తేజను తోటి విద్యార్థినులు చూసి.. ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలిక పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. తేజ తల్లి ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుందని, అప్పటినుంచి తేజ అన్యమనస్కంగా ఉంటోందని సహచర బాలికలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement