ఖమ్మం : ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపు అని ఆ పార్టీ నాయకుడు, తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. ఆదివారం ఖమ్మంలో కేటీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ప్లీనరీతోపాటు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని వారికి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడతారన్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీ ఖమ్మంలో ఏప్రిల్ 27వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే పాలేరు శాసన సభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించారు.ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. మే 16వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగుతుంది. ఓట్ల లెక్కింపు మాత్రం ఏప్రిల్ 19వ తేదీన లెక్కిస్తారు.
పాలేరులో టీఆర్ఎస్దే గెలుపు: కేటీఆర్
Published Sun, Apr 24 2016 12:32 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM
Advertisement
Advertisement