
ఖమ్మంలో టీఆర్ఎస్ విజయం
ఖమ్మం: స్థానిక కోటా శాసన మండలి ఎన్నికల్లో ఖమ్మం సీటును అధికార పార్టీ గెలుచుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుపై 31 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన విజయం సాధించారు.
లక్ష్మీనారాయణకు 316 ఓట్లు, పువ్వాడ నాగేశ్వరరావుకు- 275 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమల్ రాజ్ కు 102 ఓట్లు వచ్చాయి. నోటాకు ఒక ఓటు పడింది. ఒక ఓటు చెల్లకుండా పోయింది.
తమ పార్టీ అభ్యర్థి విజయంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు మునిగిపోయారు. టపాసులు కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.