
మహబూబ్‌నగర్‌లో కసిరెడ్డి విజయం
మహబూబ్‌నగర్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ హవా హోరాహోరీగా కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగగా.. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్ గెలుచుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి 443 ఓట్లతో విజయం సాధించారు. తొలి ప్రాధ్యానత ఓట్లలోనే ఆయన గెలుపొందారు.
మరో ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి 200 ఓట్ల అధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.